AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కల్యాణం.. కమనీయం

మహిళా క్రికెటర్‌ను ప్రేమ వివాహం చేసుకున్న రుతురాజ్ గైక్వాడ్..
టీమిండియా యువ ప్లేయర్, చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ ఓ ఇంటివాడయ్యాడు. శనివారం తన ప్రేయసి ఉత్కర్ష పవార్‌ను పెళ్లి చేసుకున్నాడు. మహబలేశ్వర్ సమీపంలోని ‘మహబలేశ్వర్ రిసార్ట్‌’లో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు శివమ్ దూబే వీరి వివాహానికి హాజరయ్యాడు. పెళ్లికి సంబంధించిన ఫొటోను చెన్నై సూపర్ కింగ్స్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకుంది. నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపింది.

ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి చెన్నై సూపర్ కింగ్స్ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం ట్రోఫీ‌ని చేతుల్లోకి తీసుకున్న రుతురాజ్.. తన ప్రేయసి ఉత్కర్షతో కలిసి ఫొటో దిగాడు. ధోనీతో కూడా ఫొటోలు దిగడంతో ఈ జంట వార్తల్లో నిలిచింది. వెంటనే వీరి పెళ్లి ప్రకటన రావడంతో వార్తలకు తెరదించినట్లయింది.

రుతురాజ్ గైక్వాడ్, ఉత్కర్ష పవార్‌లు ఇద్దరూ మహారాష్ట్రలోని పుణేకు చెందిన వారే కావడం గమనార్హం. ఉత్కర్ష కూడా గతంలో మహారాష్ట్ర తరఫున దేశవాళీ క్రికెట్ ఆడింది. చదువుపై దృష్టి పెట్టడం కోసంం ఆమె క్రికెట్‌కు గత కొంత కాలంగా దూరం ఉంటోంది.

ANN TOP 10