AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బండ్ల గణేశ్‌ షాకింగ్ కామెంట్స్ .. ఏంది మాకీ దరిద్రం అంటూ..

బాబుకు కౌంటర్ ఇచ్చిన బండ్లన్న
టీడీపీ అధినేత చంద్రబాబు బీజీపీ లీడర్ అమిత్ షాను కలవడంపై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్‌ షాకింగ్ కామెంట్స్ చేసారు. ఏంది మాకీ దరిద్రం అంటూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ఈ విషయంపై స్పందించిన బండ్ల గణేశ్‌ ట్విట్టర్ లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు..

“కర్మ కాకపోతే ఇంకేంటి.. ఆయన సిపిఎం(CPM) అంటే సిపిఎం అనాలి, బిజెపి(BJP) అంటే బిజెపి అనాలి, కాంగ్రెస్(Congress) అంటే కాంగ్రెస్ అనాలి, జనసేన(Janasena) అంటే జనసేన అనాలి. ఆయనకు కన్వీనెంట్ గా ఏ పేరు చెప్తే దాన్ని అందరు ఫాలో అవ్వాలి. అంతేగాని ఎవరికి ఆత్మాభిమానం మంచి, చెడు, మానవత్వం అనే ఉండవు. ఆయన పొగిడితే జాతిని పోగిడినట్టు.. లేకపోతే జాతికి ద్రోహం చేసినట్టు ఇంతకంటే ఏం కావాలి.. దరిద్రం.’’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ప్రస్తుతం బండ్ల గణేశ్‌ చేసిన ఈ పోస్ట్ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో, అటు టీడీపీ వర్గాల్లో చర్చనీయ్యాంశం అయ్యాయి. మరి బండ్ల గణేశ్‌ కామెంట్స్ కు టీడీపీ నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

ANN TOP 10