AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రైల్వే బాధితుల పరిహారంపై సోనూ సంచలన వ్యాఖ్యలు..

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య గంట గంటకు పెరుగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం ఈ ప్రమాదంలో 300 మందికి పైగా మరణించినట్లు, సుమారు 1000 మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోదీ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ దుర్ఘటనపై పలువురు నటీనటులు కూడా స్పందిస్తున్నారు. తాజాగా నటుడు సోనూ సూద్ కూడా దారుణ ఘటనపై స్పందించారు. బాధితులకు సహాయం చేయడంలో తనవంతు ప్రయత్నాలు మొదలు పెట్టారు.

ఈ ప్రమాదం తర్వాత మృతులకు, క్షతగాత్రులకు డబ్బులు అందజేస్తున్నారు. అయితే సోనూసూద్‌ ఇదే విషయంపై స్పందిస్తూ.. ఇలా ఒక్కసారి డబ్బులను ఇచ్చేసి.. బాధితుల భాద్యత నుంచి తప్పకుంటున్నారని చెప్పారు. ఇప్పుడు ఇచ్చిన డబ్బులు అయిపోతే బాధితుల నెక్స్ట్ పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నించారు. ప్రమాదంలో కాలు విరిగిన వారు లేదా ఎప్పటికీ పని చేయలేని వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అందుకే బాధితులకు ప్రతి నెలా నిర్ణీత వేతనం ఇవ్వాలని సోనూసూద్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.

ANN TOP 10