AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం

జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ ద్విచక్రా వాహనం అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే స్పందించిన స్థానికులు తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని చికిత్స కోసం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.

అయితే, పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులను గంగాధర్, కృపానంద్ లుగా పోలసీులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ANN TOP 10