ఒరిస్సాలో జరిగిన రైలు ప్రమాదం.. కేవలం 30 సెకండ్ల వ్యవధిలోనే జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ నాలుగు బోగీలు, బహనాడ, రైల్వే స్టేషన్ సమీపంలో పక్కకు ఒరిగిపోవడంతో.. అదే సమయంలో పక్కగా వచ్చినటువంటి, కోరమండల్ ఎక్స్‌ప్రెస్ వాటిని ఢీ కొట్టింది. రెండు రైళ్లు సమాన వేగంతో ముందు కదలడం.. ప్రమాదం పెద్దదవడానికి కారణమైందని భావిస్తున్నారు.
దీంతో రెండు రైళ్లకు చెందిన బోగీలు, కొన్ని పక్కకి ఒరిగిపోగా, మరికొన్ని గూడ్స్ రైలుపై పడినట్లు, అక్కడికి వెళ్లిన బృందం పరిశీలన తేలినట్లు తెలుస్తోంది. కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో తెలుగువారు సుమారుగా 178 మంది ఉన్నట్లు రైల్వే అధికారులు గుర్తించారు. ఇందులో ఎంతమందికి గాయాలయ్యాయి? ఎవరైనా మృతి చెందారా? ఎవరెవరికి ఏం జరిగింది? అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.