AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏబీకే ప్రసాద్‌కు రాజా రామ్మోహన్‌రాయ్‌ అవార్డు

సీనియర్‌ జర్నలిస్ట్‌ ఏబీకే ప్రసాద్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు రాజా రామ్మోహన్‌ రాయ్‌ అవార్డు వరించింది. జర్నలిజంలో విశేషమైన సేవలు అందించిన వారికి ఈ అవార్డు ప్రదానం చేస్తారు. ఈ నెల 28న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఏబీకే ఈ అవార్డు అందుకోనున్నారు. ఈ విషయాన్ని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్‌పర్సన్‌ శ్రీమతి జస్టిస్‌ రంజనా ప్రకాష్‌ దేశాయ్‌ నేతృత్వంలోని కమిటీ ఈ అవార్డును ప్రకటించింది. ఏబీకే పూర్తి పేరు ‘అన్నె భవానీ కోటేశ్వర ప్రసాద్‌’. జర్నలిజంలో ఆయనకు 75 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలుగులో వెలువడిన ప్రధాన పత్రికలన్నింటికీ సంపాదకులుగా పనిచేసిన ఘనత ఏబీకేకు ఉంది. 2004 నుంచి 2009 వరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఆయన సేవలు అందించారు.

ANN TOP 10