AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పెళ్లింట మహావిషాదం.. ముగ్గురు తోబుట్టువుల సజీవదహనం

మరికొద్ది రోజుల్లో పెండ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. పెండ్లికుమారుడు సహా అతడి ఇద్దరి సోదరీమణులు.. అనుమానాస్పద రీతిలో సజీవదహనమయ్యారు. పశ్చిమబెంగాల్‌లోని దుర్గాపుర్‌లో ఈ ఘటన జరిగింది. మృతులను మంగళ్‌ సోరెన్‌ (33), సుమీ సోరెన్‌ (35), బహమనీ సోరెన్‌ (23)గా పోలీసులు గుర్తించారు.

దుర్గాపుర్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న హఫ్నా సోరెన్‌ కుమారుడు మంగళ్‌ సోరెన్‌కు ఇటీవలే వివాహం నిశ్చయమైంది. ఆదివారం.. వధువు తరఫు కుటుంబసభ్యులు మంగళ్‌ ఇంటికి వచ్చి వివాహ ముహూర్తం ఖరారు చేయాల్సి ఉంది. ఈ కారణంగానే మంగళ్‌ సోదరీమణులు సుమీ, బహమనీ శుక్రవారం పుట్టింటికి వచ్చారు. సుమీ సోరెన్‌ కోల్‌కతాలో నర్సుగా పనిచేస్తుండగా.. బహమనీ గృహిణి. వీరి తండ్రి శనివారం తెల్లవారుజామున ఏదో పని మీద మార్కెట్‌కు వెళ్లారు. ఆయన తిరిగి వచ్చేసరికి తాళం వేసి ఉన్న ఇంటి నుంచి మంటలు వస్తున్నాయి.

వెంటనే తలుపు బద్దలుకొట్టి లోపలికి వెళ్లగా.. కుమారుడు, ఇద్దరు కూమార్తెలు విగతజీవులుగా పడున్నారు. హఫ్నా ఇంట్లో ఎటువంటి సమస్యలు లేవని, అసలేం జరిగిందో తెలియట్లేదని స్థానికులు తెలిపారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10