AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేపటి నుంచి రూ.75 నాణెం

న్యూఢిల్లీ : దేశంలో రూ.75 విలువగల నాణెం ఆదివారం నుంచి చలామణి కానుంది. కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోడీ ఆదివారం ప్రారంభించే నేపథ్యంలో దీనికి గుర్తుగా ఈ కొత్త నాణెం ప్రభుత్వం విడుదల చేస్తుంది. దీనికి సంబంధించి అధికారిక గెజిట్‌ను ఆర్థిక వ్యవహారాల శాఖ వెలువరించింది.

ఈ కొత్త కాయిన్ దాదాపుగా 35 గ్రాములు పైబడి ఉంటుంది. నాణెం ఓ వై పు అశోక చక్రం సింహం, మధ్యలో దేవనాగరి లిపిలో భారత్ పేరు, ఇంగ్లీషులో ఇండియా పదం ఉంటాయి. రూపాయి గుర్తు, ఈ నాణెం మారక విలువ 75 అంకె ఉం టాయి. మరో వైపున నూతన పార్లమెంట్ భవనం ప్రాంగణం ప్రతిమ, దిగువన 2023 అంకెలు ఉంటాయి. రూ 75 నాణెం దేశానికి స్వాతంత్య్ర సిద్ధికి ప్రతీకగా కూడా నిలుస్తుంది. ఈ నాణెం త్వరితగతిన తమ వంతుగా దక్కించుకోవాలని పౌరులలో ఆసక్తి నెలకొంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10