AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ

హైదరాబాద్: అవినాష్ రెడ్డి (Avinash Reddy) ముందస్తు బెయిల్ పిటిషన్‌ (Mundostu Bail Petition)పై శుక్రవారం తెలంగాణ హైకోర్టు (Telangana Hidh Court)లో విచారణ జరగనుంది. ఉదయం 10.30 గంటలకు విచారణ చేయనుంది. ఈ నేపథ్యంలో సీబీఐ, అవినాష్, సునీత తరఫు న్యాయవాదులు సుదీర్ఘంగా వాదనలు వినిపించనున్నారు.

కాగా సీఎం జగన్‌ చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు, వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ వ్యవహారం గురువారం రోజంతా టెన్షన్‌ పెట్టింది. అవినాశ్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌పై తెలంగాణ హైకోర్టు వెలువరించే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చివరికి… విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. ఇక… అవినాశ్‌ తల్లి చికిత్స పొందుతున్న కర్నూలులోని విశ్వభారతి హాస్పిటల్‌ చుట్టూ అవినాశ్‌ అనుచరుల హల్‌చల్‌ గురువారం కూడా కొనసాగింది.

ANN TOP 10