AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేపే తెలంగాణ పాలీసెట్‌ ఫలితాలు..

తెలంగాణ పాలిటెక్నిక్ కామ‌న్ ఎంట్రెన్స్ టెస్ట్ (TS Polycet- 2023) పరీక్ష ఫలితాలు రేపు (మే 26) వెలువడనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ (ఎస్‌బీటీఈటీ) కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మే 17న జరిగిన పాలీసెట్‌ పరీక్ష ఫలితాలు శుక్రవారం ఉదయం 11 గంటలకు విడుదలవుతాయని ఆయన వెల్లడించారు. ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లో రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోవచ్చు. పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

పాలీసెట్‌ ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాలిటెక్నీక్ కాలేజీలు, ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో న‌డుస్తోన్న పాలిటెక్నిక్ కాలేజీలు, ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ అగ్రిక‌ల్చర్‌ యూనివ‌ర్సిటీ, పీవీ న‌ర్సింహారావు తెలంగాణ యూనివ‌ర్సిటీతో పాటు వీటికి అనుబంధంగా ఉన్న పాలిటెక్నీక్ కోర్సులు అందించే సంస్థల్లో సీట్లను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ సారి పాలీసెట్‌ ప్రవేశాల్లో బాసర ఆర్‌జీయూకేటీ చేరడం లేదని ఎస్‌బీటీఈటీ ఇప్పటికే స్పష్టం చేసింది.

ANN TOP 10