AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇది ఉత్తుత్తి బడ్జెట్టే

మాటలే.. చేతల్లేవ్‌
బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఉత్తుత్తిదేనని, మాటలు తప్ప చేతలు లేవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. మన్నెగూడలో మంగళవారం బీజేపీ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ తరగతులకు ముఖ్య అతిథిగా సంజయ్‌ హాజరయ్యారు. బండి సంజయ్‌ తో పాటు…జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఇంద్రసేనారెడ్డి, మురళీధర్‌ రావు, మాజీ ఎంపీలు జితేందర్‌ రెడ్డి, వివేక్‌, బూర నర్సయ్య గౌడ్‌ తదితరులు హాజరయ్యారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. బడ్జెట్‌ను చూసి జనం నవ్వుకుంటున్నారు. ప్రజల్లో బడ్జెట్‌పై చర్చ జరగడంలేదని, కేటాయింపులు ఘనం.. ఖర్చులు స్వల్పం. రూ.2.9 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఆదాయం మాత్రం రూ. 1.30 లక్షల కోట్లే చూపడం విడ్డూరంగా ఉందన్నారు. మిగిలిన ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో ఎందుకు చెప్పలేదన్నారు. లిక్కర్‌, భూములు అమ్మకోవడం, పన్నులు, ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపడం ద్వారా ఆదాయం పెంచుకోవాలనుకుంటున్నారని అన్నారు. కేంద్రాన్ని తిట్టడానికి మాత్రమే బడ్జెట్‌ ప్రవేశపెట్టినట్లుందని అన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌లు నిర్వహిస్తున్నామన్నారు.

ANN TOP 10