AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..

మండుతున్న ఎండల నుంచి ఉపశమనం కల్పించేలా తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ చల్లటి కబురు చెప్పింది. ఇవాళ, రేపట్లో.. నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్‌ సముద్రం, అండమాన్‌ నికోబార్‌ దీవులకు ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

ఉత్తర-దక్షిణ ద్రోణి.. విదర్భ నుంచి ఉత్తర కేరళ వరకు మరఠ్వాడా అంతర్గత కర్ణాటక మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దక్షిణ తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. దాంతో.. ఏపీలో ఇప్పటికే దక్షిణ, నైరుతి దిశలో గాలులు వీస్తున్నాయి. రాబోయే రెండు రోజుల్లో ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఉత్తర కోస్తా, రాయలసీమలోనూ రెండు, మూడు రోజులు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది. ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కొన్ని చోట్ల వీచే చాన్స్‌ ఉంది.

ANN TOP 10