AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అంబానీ కంపెనీ కఠిన నిర్ణయం.. ఉద్యోగులకు షాక్..

ఒకేసారి వెయ్యి మంది ఔట్!
రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన రిటైల్ సంస్థ జియో మార్ట్ కఠిన నిర్ణయంతీసుకుంది. మెట్రో క్యాష్ అండ్ క్యారీని కొనుగోలు చేసిన తర్వాత కార్యకలాపాలను క్రమబద్ధీకరించే ప్రయత్నాల్లో భాగంగా జియో మార్ట్ 1000 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. రానున్న కొన్ని వారాల్లో ఈ ఆన్‌లైన్ హోల్‌ సేల్ కంపెనీ పెద్ద స్థాయిలో వ్యయ నియంత్రణలు చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అందులో మూడింట రెండొంతుల మంది ఉద్యోగులను తొలగించే ప్రక్రియ సైతం ఉన్నట్లుసమాచారం. బీ2బీ వ్యాపారంలో పోటీని తట్టుకునేందుకే జియో మార్ట్ ఈ వ్యయ నియంత్రణ చర్యలకు దిగినట్లు తెలుస్తోంది.

ఎకనామిక్ టైమ్స్ తెలిపిన ప్రకారం.. జియో మార్ట్ (Jio Mart) తమ సంస్థలో పని చేస్తున్న 1000 మంది ఉద్యోగులను రాజీనామా చేయాలని కోరింది. అందులో కార్పొరేట్ ఆఫీసులో పని చేస్తున్న 500 మంది ఎగ్జిక్యూటివ్ ఆఫీర్లు ఉన్నట్లు సమాచారం. దాంతో పాటు వందల మంది ఉద్యోగులను పర్ఫామెన్స్ ఇంప్రూవ్‌మెంట్ ప్లాన్‌లోకి మార్చింది. మిగిలిన సేల్స్ స్టాఫ్‌ ఫిక్స్‌డ్ శాలరీ తగ్గించి వేరియేబుల్ పే విధానంలోకి తీసుకొచ్చిందని ఈ అంశానికి సంబంధం ఉన్న ఓ అధికారి తెలిపినట్లు ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది.

ANN TOP 10