నానా రచ్చ చేసిన డింపుల్ హయతి.. కేసు నమోదు
ఐపీఎస్ అధికారితో హీరోయిన్ డింపుల్ హయతి గొడవకు దిగింది. ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే కారును తన కారుతో ఢీకొట్టింది. ఆపై రుబాబు ప్రదర్శిస్తూ కాలితో తన్నింది. జర్నలిస్ట్ కాలనీలో ఒకే అపార్ట్మెంట్‌లో నటి హయతి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే ఉంటున్నారు. రాహుల్ హెగ్డే అధికారిక వాహనాన్ని డింపుల్ హయతి కాబోయే భర్త డేవిడ్ పార్కింగ్ ప్లేస్‌లో ఢీ కొట్టాడు.
అదేంటని రాహుల్ డ్రైవర్ చేతన్ కుమార్ ప్రశ్నించగా.. కారును కాలితో తంతూ నానా రచ్చ చేసింది. దీనిపై రాహుల్ డ్రైవర్ చేతన్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కింద డింపుల్‌పై 353, 341, 279 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పుడే కాదని డింపుల్ పలుమార్లు ఇలాగే ప్రవర్తించిందని రాహుల్ హెగ్డే తెలిపారు. నచ్చజెప్పేందుకు యత్నించినా కూడా ఆమె తీరు మార్చుకోలేదట. దీంతో ఫిర్యాదు చేసినట్టు రాహుల్ వెల్లడించారు.