AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఒడిలో పులి.. మెడలో పాము.. దటీజ్‌ విజయ దేవరకొండ

చిత్ర విచిత్ర విన్యాసాలతో తన సినిమాలకు పబ్లిసిటీ తెచ్చుకోవడంలో విజయ్‌ దేవరకొండ స్టైలే వేరు. తరచూ ఇలాంటి ఫీట్స్‌తో వార్తల్లో ఉండే అర్జున్‌ రెడ్డి.. తాజాగా పాములు, పులులతో ఆడుకున్న వీడియో వైరల్‌ అవుతోంది.

టాలీవుడ్‌లో రౌడీ స్టార్‌గా ఊహించని ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సొంతం చేసుకున్న సినీ నటుడు విజయ్‌ దేవరకొండ. ఇటీవల విడుదలైన ‘లైగర్‌’ నిరాశపరచగా.. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఖుషి’ మూవీపై ఫోకస్‌ చేశాడు. ఇక న్యూ ఇయర్‌ సందర్భంగా షర్ట్‌లెస్‌ ఫొటో షేర్‌ చేసి అమ్మాయిలకు కునుకు లేకుండా చేసిన విజయ్‌.. తాజాగా దుబాయ్‌లో పాములు, పులులతో ఆడుకున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

ANN TOP 10