AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘మూన్ దుబాయ్’ని నిర్మించాలని ప్లాన్

అంతరిక్ష ప్రియులు, ప్రయాణికులందరికీ శుభవార్త! మీరు చంద్రునిపై అడుగుపెట్టడానికి అంతరిక్షాన్ని సందర్శించాల్సిన అవసరం లేదు. షాకింగ్ గా ఉందా? ఇప్పుడు చంద్రుడు దుబాయ్‌లో భూమిపైనే ఉంటాడు. వివరాల్లోకి వెళితే..

కెనడియన్ ఆర్కిటెక్చరల్ కంపెనీ, మేధో సంపత్తి లైసెన్సర్ మూన్ వరల్డ్ రిసార్ట్స్ ఇంక్ (MWR)’మూన్ దుబాయ్’ని నిర్మించాలని ప్లాన్ చేస్తోంది. ఇది ఖగోళం రూపంలో ఉన్న $5 బిలియన్ల డెస్టినేషన్ రిసార్ట్. ఇది ఏటా 2.5 మిలియన్ల మంది అతిథులను రప్పిస్తుందని అంచనా వేస్తున్నారు. దుబాయ్‌లోని 30-మీటర్ల (100-అడుగులు) ఈ భవనంపై 274-మీటర్ల (900-అడుగుల) చంద్రుని ప్రతిరూపమైన మూన్-షేప్ ను రిసార్ట్ర్ పై నిర్మించనున్నారు. సాండ్రా జి. మాథ్యూస్, మైఖేల్ ఆర్. హెండర్సన్‌లు దీని కోసం కసరత్తులు చేస్తున్నారు. దీన్ని 48 నెలల్లో నిర్మించేలా డిజైన్ చేశారు.

ఇక్కడ ఏర్పాటు చేసిన చంద్రుడు క్రింద పీఠం లాంటి వృత్తాకార భవనంపై ఉండి, దుబాయ్‌లో రాత్రిపూట మెరుస్తూ ఉంటాడు. దీని నిర్మాణం గనక పూర్తయితే.. ఇది ప్రపంచంలోని ఎత్తైన భవనంగా మారనుంది. ఇతర నిర్మాణ అద్భుతాలకు నిలయంగా నిలవనుంది.

ANN TOP 10