AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం.. తల బయటపెట్టి చూస్తున్న చిన్నారి మృతి

కారు డ్రైవరు నిర్లక్ష్యంతో బంధువుల పెళ్లి వేడుకలో ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం బొజ్జగూడెం గ్రామంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం… గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి పెళ్లి వేడుకలు జరుగుతుండగా బాణోతు ఇంద్రజ(9) అనే చిన్నారి వరుడు, వధువు ఉన్న కారు వెనుక సీటులో ఒంటరిగా కూర్చొని కిటీకీలోంచి తల బయట పెట్టి డ్యాన్సులు చూస్తోంది.

ఇదే సమయంలో కారు డ్రైవరు చిన్నారిని గమనించకుండా డోర్‌ అద్దం బటన్‌ నొక్కాడు. చిన్నారి మెడ అందులో ఇరుక్కుని పోవడంతో ఊపిరాడక మృతి చెందింది. దీంతో బొజ్జగూడెంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతురాలి తండ్రి బాణోతు వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు డ్రైవరు శేఖర్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ANN TOP 10