రూ.17,700 కోట్లు కేటాయింపు
వ్యవసాయానికి రూ.26,831 కోట్లు
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ (2023-24)లో వ్యవసాయ రంగం తరువాత అధికంగా నిధులు కేటాయించింది దళితబంధు పథకానికే.. ప్రతి నియోజకవర్గంలో 1,100 మందికి దళితబంధు అందించి వారి జీవితంలో వెలుగులు నింపాలన్న సంకల్పంతో ఈ నిధులు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. అలాగే రైతుబంధుకు రూ.15 వేల కోట్లు కేటాయించామన్నారు. కేంద్రం సహకరించక పోయినా.. ప్రజల ఆకాంక్షలు నెరవేరేలా బడ్జెట్‌ను రూపొందించామన్నారు. తెలంగాణ బడ్జెట్ దేశానికి మోడల్‌గా నిలుస్తుందని మంత్రి హరీష్‌రావు అన్నారు.
అంతకుముందు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని తన ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి ప్రవేశపెట్టినున్న బడ్జెట్ ప్రతులను హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు.
అలాగే తెలంగాణ శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని తన ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి ప్రవేశపెట్టినున్న బడ్జెట్ ప్రతులను ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు అందజేశారు. వేముల ప్రశాంత్ రెడ్డి, స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు తదితరులు పోచారంను కలిసిన వారిలో ఉన్నారు.