AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ముగిసిన తెలంగాణ కేబినెట్‌ సమావేశం

హైదరాబాద్‌: తెలంగాణ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ ధ్యక్షతన సమావేశం జరిగింది. రేపు అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మంత్రివర్గం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా బడ్జెట్‌పై మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలిపింది. రేపు బడ్జెట్‌ ను అసెంబ్లీలో మంత్రి హరీష్‌ రావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ నెల 8న బడ్జెట్‌ పై సాధారణ చర్చ ఉంటుంది. 9,10,11 తేదీలలో పద్దులపై చర్చ జరగనుంది. ఈ నెల 12న సభలో ప్రభుత్వం ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టనుంది. అదే రోజున బిల్లుకు సభ ఆమోదం తెలపనుంది. అనంతరం అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ముగియనున్నాయి.
ఇదిలా ఉంటే.. ఈరోజు మధ్యాహ్నం మహారాష్ట్రలోని నాందేడ్‌ లో బిఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు సిఎం కెేసీఆర్‌ బయల్దేరి వెళ్తారు.

ANN TOP 10