AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బ‌డా ప‌హాడ్ ద‌ర్గా ద‌ర్శ‌నానికి వెళ్తుండ‌గా వ్యాన్ బోల్తా..

35 మందికి తీవ్ర‌గాయాలు
బ‌డా ప‌హాడ్ ద‌ర్గా ద‌ర్శ‌నానికి వెళ్తుండ‌గా డీసీఎం వ్యాన్ బోల్తా పడి 35 మందికి తీవ్ర‌గాయాలయ్యాయి.గాయాప‌డిన వారిని 108 అంబులెన్స్ లో జిల్లా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. నెల రోజుల్లో ఇది రెండో ఘ‌ట‌న. బ‌డా ప‌హాడ్ ద‌ర్గాలో మొక్కులు తీర్చుకునేందుకు ఓ కుటుంబం గురువారం రాత్రి వారి గ్రామం నుంచి డీసీఎం వ్యాన్ లో బంధువులతో క‌లిసి బ‌య‌లు దేరారు. శుక్ర‌వారం తెల్ల‌వారు జామున‌ మ‌రో అర గంట‌లో బ‌డా ప‌హాడ్ ద‌ర్గా వ‌ద్ద‌కు చేరుకుంటారు అన‌గా రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. డీసీఎం ఆదుపుత‌ప్పి బోల్తా ప‌డింది. దీంతో వ్యాన్ లో ప్ర‌యాణిస్తున్న 35 మందికి తీవ్ర‌గాయ‌లు అయ్యాయి. మ‌రో 25 మందికి స్వ‌ల్ప‌గాయ‌లతో బ‌య‌ట‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసింది.

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం, చందూరు గ్రామ శివారులో శుక్రవారం తెల్ల‌వారు జామున ఈ ప్ర‌మాదం జ‌రిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం, మానాల గ్రామానికి చెందిన ముదిరాజు పాయిలు నిజామాబాద్ జిల్లాలోని బడా పహార్ ద‌ర్గా వ‌ద్ద‌కు మొక్కులు తీర్చుకునేందుకుకుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులతో కలిసి డీసీఎం వ్యాన్ లో బ‌య‌లు దేరారు.

అయితేమ‌రో అర‌గంట‌లో బ‌డాప‌హాడ్ చేరుకుంటారన‌గా ప్రమాదవశాత్తు డీసీఎం వ్యాన్ ఒక్కసారిగా బోల్తా కొట్టింది. అయితే వ్యాన్ లో సుమారు 60 మంది వరకు భక్తులు ఉన్నట్లు సమాచారం. అందులో 35 మంది గాయాలపాలైనట్లు స్థానికులు చెబుతున్నారు. మ‌రో 25 మందికి స్వ‌ల్ప‌గాయ‌ల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు.

విషయం తెలుసుకున్న వ‌ర్ని పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులని హుటాహుటిన చికిత్స నిమిత్తం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి 108 అంబులెన్స్ లో తరలించారు. ప్రస్తుతం గాయాల పాలైన వారిలో 31 మందిప‌రిస్థితి నిల‌క‌డగా ఉండగా మరో నలుగురి పరిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వీరంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10