కర్ణాటక ఎగ్జిట్ పోల్స్ పై బీజేపీ నేత డా.లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్ ను ఆయన కొట్టిపారేశారు. తాము పీపుల్ పోల్స్ ని నమ్ముతామని చెప్పారు.బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటక ప్రజలు మోదీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే కర్నాటక అభివృద్ధి సాధ్యమని చెప్పారు. ఖచ్చితంగా కర్నాటకలో బీజేపీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
