AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఐశ్యర్యకు మంత్రి జగదీష్ రెడ్డి నివాళులు

అమెరికాలో దుండగుడి కాల్పుల్లో ప్రాణాలు విడిచిన యువతి ఐశ్యర్యకు మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్ కుమార్, శానంపూడి సైదిరెడ్డి నివాళులర్పించారు. కొన్ని రోజుల క్రితం ఐశ్యర్య నుంచి ఎలాంటి కాల్స్ లేకపోవడంతో ఆమె తల్లిదండ్రులు.. మంత్రి జగదీష్ రెడ్డి ఆశ్రయించారు. దీనిపై ఆరాతీయగా.. దుండగుడి కాల్పుల్లో ఐశ్యర్య చనిపోయినట్లు తెలిసింది. ఇక మంత్రి కేటీఆర్, మంత్రి జగదీష్ రెడ్డి చొరవతో ఆమె పార్ధీవదేహాన్ని అమెరికా నుంచి స్వగ్రామానికి రప్పించారు.ఈ క్రమంలోనే నేడు నగరానికి చేరుకున్న ఐశ్వర్య రెడ్డి పార్థివ దేహానికి మంత్రి,ఎమ్మెల్యేలు నివాళులర్పించి.. యువతి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

ANN TOP 10