నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఫ్లెక్సీలు కలకలం రేపాయి. బోధన్ ఎమ్మెల్యే షకీల్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. బోధన్ నియోజకవర్గ బీజేపీ నేతల పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి.. ఎమ్మెల్యే కనబడటం లేదని పేర్కొన్నారు. ధాన్యం తానే కొంటానని చెప్పి 20 రోజులుగా కనిపించకుండా పోయారని తెలిపారు.కొంటానని చెప్పిన నాటి నుంచి ఇప్పటివరకు కనబడలేదని.. వడగండ్ల వానకు నష్టపోయిన రైతులను ఆదుకుంటానని చెప్పి.. ఒక్క ధాన్యం గింజను కూడా లేదని.. ఇకనైనా ఎమ్మెల్యే కళ్లు తెరిచి ప్రతి ధాన్యం గింజ కొనాల్సిందేనని స్పష్టం చేశారు. ఇక ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తున్నట్టు ఫ్లెక్సీలు పెట్టడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని ఖండిస్తూ.. స్థానిక బీజేపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
