AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తా..

ఆ పార్టీకే నా మద్దతు: నటుడు సుమన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
రాబోయే రోజుల్లో కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తానంటున్నారు నటుడు సుమన్. తెలంగాణలో తన మద్దతు బీఆర్ఎస్‌కు ఉంటుందన్నారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం కోమటితిప్పలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. కాపునాడు నియోజకవర్గ అధ్యక్షుడు సత్తినేని శ్రీనివాస తాతాజీ ఇంటి దగ్గర మాట్లాడారు. వర్షాలు, విపత్తులు ఏటా ఉంటాయని.. ప్రభుత్వాలు ఆ దిశగా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అన్నదాత బాగుంటేనే దేశం బాగుంటుందని.. రైతులు కోరేది కొంచమేనని ఏ ప్రభుత్వమైనా వారి సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలి అన్నారు.

అంతేకాదు సుమన్ ఇటీవల తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో చేసిన వ్యాఖ్యలు.. ఆ తర్వాత ఏపీలో జరిగిన పరిణామాలపైనా సుమన్ స్పందించిన సంగతి తెలిసిందే. రజినీకాంత్ ప్రసంగంలో తప్పేమీ లేదని.. చంద్రబాబు గురించి చెప్పిన మాటలు నిజమే అన్నారు. చంద్రబాబు హైదరాబాద్‌కు ఓ రూపం తీసుకొచ్చారని.. మెయిన్ ఆర్కిటెక్చర్ ఆయనే అన్నారు. ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయిందన్నారు.

ANN TOP 10