AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్‌లో వాహనదారులకు అలర్ట్‌…

హైదరాబాద్‌ వాహనదారులకు బిగ్‌ అలర్ట్‌. ఈ రూట్లలో 90 రోజుల పాటు వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు సైబరాబాద్‌ పోలీసులు. 13వ తేదీ నుంచి అంటే ఎల్లుండి నుంచే గచ్చిబౌలి – కొండాపూర్ రాకపోకలు నిలిపివేయనున్నారు. ఏకంగా 90 రోజుల పాటు రాకపోకలు నిషేధిస్తూ సైబరాబాద్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

గచ్చిబౌలి కొండాపూర్ ఫ్లైఓవర్ నిర్మాణం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు చేస్తున్నారు సైబరాబాద్‌ పోలీసులు. గచ్చిబౌలి జంక్షన్ నుంచి కొండాపూర్ వెళ్లే రోడ్డు వరకు ఫ్లైఓవర్ నిర్మాణం చేపడుతున్నారు. దీంతో ఈ ట్రాఫిక్ మళ్లింపులు చేస్తున్నారు సైబరాబాద్‌ పోలీసులు. ఈ సమాచారాన్ని దృష్టిలో ఉంచుకుని.. హైదరాబాద్‌ వాహనదారులు.. ఇతర రూట్లల్లో వెళ్లాలని సూచనలు చేశారు.

ANN TOP 10