రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ భద్రాచలం షెడ్యూల్ ఖరారైంది. రేపు (గురువారం) భద్రాచలంలో గవర్నర్ పర్యటించనున్నారు. రేపు ఉదయం 7 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి గవర్నర్ భద్రాచలం వెళ్లనున్నారు. 8:30 గంటలకు భద్రాచలం చేరుకోనున్న గవర్నర్ తొలుత భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామిని (Bhadrachal Temple) దర్శించుకోనున్నారు. అనంతరం భద్రాచలంలోని శ్రీ కృష్ణ మండపంలో హెల్త్ అవేర్‌నెస్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆపై భద్రాచలంలోని గిరిజన అభ్యుదయ భవన్‌కు గవర్నర్ వెళ్లనున్నారు. అక్కడ గిరిజనులతో గవర్నర్ తమిళిసై ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్నారు. గవర్నర్ భద్రాచలం పర్యటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యాయి. భద్రాచలంలో ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
