పరారీలో ఉన్న సల్మాన్‌ను పట్టుకున్న పోలీసులు..
హైదరాబాద్ టెర్రర్ లింక్స్‌కి సంబంధించి షాకింగ్ డీటెయిల్స్ బైటికొస్తున్నాయి. భోపాల్ ATS పోలీసుల రైడ్‌లో పట్టుబడ్డవాళ్లంతా ఏడాదిన్నరగా ఇక్కడ రాడికల్ ఇస్లామ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. స్థానిక పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి.
అధికారులకు అనుమానం రాకుండా నిందితులందరూ తమతమ ఇళ్లూ పక్కపక్కనే ఉన్నట్టు వాళ్ల ఆధార్ కార్డుల్ని తయారుచేసుకున్నారు. కూలీ నుంచి డెంటిస్ట్ వరకు రకరకాల వృత్తుల్లో కొనసాగుతున్నారు. అధికారులకు అనుమానం రాకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఉగ్రకుట్ర కేసులో పోలీసులు మరొకరిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న సల్మాన్‌ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో మొత్తం ఆరుగురు అరెస్టయ్యారు. ఉగ్రవాద కుట్రలో అరెస్టు చేసిన నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 19 వరకు నిందితులకు రిమాండ్ విధించింది.