పేదల భూములు లాక్కునే కుట్రలో భాగమే ఆయన నియామకం
ఐఏఎస్‌లు ఏ రాష్ట్రానికి కేటాయిస్తే గౌరవంగా ఆ రాష్ట్రానికి వెళ్లి పనిచేసుకోవాలని సీఏల్పీ నేత భట్టి విక్రమార్క సూచించారు. కానీ సోమేశ్ కుమార్ లాంటి వ్యక్తి ఏపీకి వెళ్లకుండా ప్రభుత్వ అడ్వయిజర్‌గా పనిచేయడంపై ఆసక్తి ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. భూ భకాసురులు పేదల భూములు ఆక్రమించుకునేందుకు సోమేశ్ సహాయ పడ్డారని చెప్పారు.
ధరణితో తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ధరణి పేరు చెప్పి కాంగ్రెస్ (Congress) పేదలకు ఇచ్చిన భూములను లాక్కున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం పేదల భూములు లాక్కుని రియలెస్టేట్ వ్యాపారం చేస్తుందని ఆరోపించారు. ఒక్క ఇబ్రహింపట్నం నియోజకవర్గంలోనే 5 లక్షల కోట్ల విలువైన భూములు లాక్కున్నారని ఆరోపణ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల కోట్ల విలువైన భూములను లాక్కునే ప్లాన్‌లో సూత్రదారి సోమేశ్ కుమార్‌ను మళ్ళీ సలహాదారుగా నియమించుకున్నారని అన్నారు. ఓఆర్‌ఆర్ లీజు వెనక సోమేశ్ కుమార్, అరవింద్ ఉన్నారని ఆరోపించారు.