నిన్న సెక్రటేరియట్ ఎంట్రీ విషయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పేడ పిసికే అలవాటున్న తలసానికి పిసుకుడు గురించే మాట్లాడుతారన్నారు. పిసుకుడు సంగతి దేవుడెరుగు.. అతను నమిలే పాన్ పరాక్ మానేస్తే బాగుంటుందని రేవంత్ సూచించారు. అరటి పండ్ల బండి దగ్గర మేక నమిలినట్లు పాన్ పరాక్‌లు నమిలే వారు కూడా తన గురించి మాట్లాడితే అంత గౌరవంగా ఉండదన్నారు.
ఇంకా రేవంత్ మాట్లాడుతూ.. ‘‘ఆయనకు అంతగా కోరిక ఉంటే.. ఏం పిసకాలనుకుంటున్నారో, ఎక్కడకు రావాలో తారీఖు చెబితే వస్తా.. ఎవరేం పిసుకుతారో చూద్దాం. కేసీఆర్ కాళ్లు పిసకడం అనుకుంటున్నాడా.. రేవంత్ రెడ్డిని పిసకడం అంటే..? మంత్రిగా మాట్లాడేటప్పుడు బాధ్యతగా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. నేను పీసీసీసీ అధ్యక్షుడిని. తలసాని జీవితాంతం కేసీఆర్ కాళ్లు పిసికినా నా స్థాయికి రాలేరు’’ అని పేర్కొన్నారు.