బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం తుఫానుగా మారే అవకాశమున్నట్లు చెన్నై వాతావరణ పరిశోధనా కేంద్రం డైరెక్టర్ సెందమరై కన్నన్ ప్రకటించారు. దక్షిణ అండమాన్‌ను ఆనుకొని బంగాళాఖాతం పశ్చిమ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమేణా బలపడి తుఫానుగా మారనుందని తెలిపారు. దీంతో 90 కిలోమీటర్ల వేగంతో కన్నియాకుమారి, బంగాళాఖాతం ఆగ్నేయ, మధ్య ప్రాంతాల్లో గాలులు వీస్తాయన్నారు.
12వ తేదీ వరకు సముద్రంలో జాలర్లు చేపల వేటకు వెళ్లరాదని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా వుండగా కోయంబత్తూరు, ఈరోడ్, తిరుప్పూర్ తదితర జిల్లాల్లోని పలు చోట్ల మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. బుధవారం సైతం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశముందని ఆయన వివరించారు.