జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ విడుదలైన ఇంటర్ ఫలితాలలో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో .. బొడ్డుపెళ్లి అభిషేక్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నాడు.అభిషేక్ మరణంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
