AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

డెక్కన్ ఇంజనీరింగ్ కాలేజిలో టెర్రరిస్టు!

హైదరాబాద్ లో ఉగ్ర కదలికలు సంచలనం రేపాయి. హైదరాబాద్ కేంద్రంగా దాడులకు కుట్ర చేసిన ఉగ్ర ముఠాను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసింది. మొత్తం 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.భోపాల్‌కు చెందిన 11 మంది, హైదరాబాద్‌కు చెందిన 5గురిని అరెస్టు చేశారు.మధ్యప్రదేశ్,తెలంగాణ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో ఈ ఉగ్రకుట్ర బయటపడింది.అంతేకాదు ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగించడంతో పాటు యువతను టెర్రరిజం వైపు మళ్లించేందుకు ప్లాన్ చేస్తున్నారని పోలీసులు గుర్తించారు.ఇదిలా ఉండగా అధికారులు ఈ కేసులో అరెస్ట్ అయిన వారి వివరాలు వెల్లడించారు.

మహ్మద్ సలీం, అబ్దుర్ రెహ్మాన్, అబ్బాస్ అలీ, షేక్ జునైద్, మహ్మద్ హమీద్ లను మధ్యప్రదేశ్ ఏటీఎస్ అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. మహ్మద్ సల్మాన్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్టు తెలిపారు. సలీం అనే వ్యక్తి నుంచి రెండు ఎయిర్ గన్స్ స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఈ ఐదుగురిని హైదరాబాద్ నుంచి భోపాల్ తరలించారు. వీరు నెలరోజుల క్రితం హైదరాబాద్ వచ్చినట్టు గుర్తించారు. అయితే వీరిలో ఒకడైన సలీం డెక్కన్ ఇంజనీరింగ్ కాలేజిలో బయోటెక్నాలజీ విభాగానికి HOD గా పనిచేస్తున్నట్టు గుర్తించారు. ఇక ఈ ఉగ్ర కుట్రలో మహ్మద్ హమీద్ కీలకంగా ఉన్నట్టు గుర్తించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10