రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ పంచాయితీ కార్యదర్శుల సమ్మె కొనసాగుతుంది. నాలుగేళ్ల ప్రోబేషన్ పీరియడ్ పూర్తవడంతో.. రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ 11 రోజులుగా జేపీఎస్ లు నిరవధిగా చేస్తున్నారు. అయితే జేపీఎస్ ల సమ్మెను ఖండించిన ప్రభుత్వం.. నేడు సాయంత్రం 5 గం.లోపు విధుల్లో చేరాలని డెడ్ లైన్ విధించింది. లేదంటే విధుల్లో నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. అయితే ప్రభుత్వ హెచ్చరికలకు ఏ మాత్రం వెనక్కితగ్గకుండా.. నిరసన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ డెడ్లైన్ ముగిసినప్పటికీ సమ్మె కొనసాగిస్తున్నారు. దీంతో జేపీఎస్ ల పట్ల ప్రభుత్వ ఎలాంటి చర్యలు తీసుకోనుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
