AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

15 క్రూయిజ్ మిస్సైళ్ల‌ను కూల్చేశాం: ఉక్రెయిన్‌

కీవ్‌: ర‌ష్యా సంధించిన 15 క్రూయిజ్ మిస్సైళ్ల‌ను కూల్చివేసిన‌ట్లు ఉక్రెయిన్ వెల్ల‌డించింది. రాజ‌ధాని కీవ్‌ను టార్గెట్ చేస్తూ ర‌ష్యా ఆ క్షిప‌ణుల‌ను వ‌ద‌లిన‌ట్లు తెలుస్తోంది. త‌మ దేశానికి చెందిన వైమానిక ద‌ళం ఆ మిస్సైళ్ల‌ను కూల్చిన‌ట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్ల‌డించారు. ఈ అటాక్‌లో ఎటువంటి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేద‌న్నారు. కీవ్‌కు చెందిన సీనియ‌ర్ మిలిట‌రీ అధికారి షెరియే పొప్కో ఈ విష‌యాన్ని చెప్పారు.

కాస్పియ‌న్ స‌ముద్ర ప్రాంతం నుంచి నాలుగు బాంబ‌ర్ విమానాల ద్వారా ఆ క్షిప‌ణుల‌ను ర‌ష్యా ప్ర‌యోగించిన‌ట్లు ఉక్రెయిన్ అధికారి తెలిపారు. ఆదివారం రాత్రి భారీ స్థాయిలో ర‌ష్యా త‌న డ్రోన్ల‌ను లాంచ్ చేసిన‌ట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. ఉప్పెన‌లా వ‌చ్చిన డ్రోన్లు, మిస్సైళ్ల వ‌ల్ల ఒక‌రు మృతిచెందారు. మ‌రో అయిదుగురు గాయ‌ప‌డ్డారు. ర‌ష్యా విక్ట‌రీ డే సెల‌బ్రేట్ చేసుకోవ‌డానికి కొన్ని గంట‌ల ముందే ఈ మిస్సైల్ అటాక్ జ‌రిగిన‌ట్లు చెబుతున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10