గ్రూప్-4 ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నవారు తమ బయోడేటాలో మార్పులు చేసుకునేందుకు టీఎ్‌సపీఎస్సీ అవకాశం కల్పించింది. జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, వార్డ్ ఆఫీసర్, ఆడిటర్ పోస్టుల దరఖాస్తుదారుల బయోడేటాలో తప్పులు ఉన్నట్టు గుర్తించామని కమిషన్ పేర్కొంది. తప్పులను సరిదిద్దుకునేందుకు ఎడిట్ ఆప్షన్ ఇస్తున్నామని టీఎ్‌సపీఎస్సీ కార్యదర్శి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 9 నుంచి 15 వరకు ఎడిట్ ఆప్షన్ ఉంటుందని, దరఖాస్తుదారులు తమ బయోడేటాలో మార్పులు చేసుకోవాలని కోరారు. మార్పులకు ఇదే చివరి అవకాశమని పేర్కొన్నారు.