వనపర్తి జిల్లా ఏదుల రిజర్వాయర్ ను మంత్రి నిరంజన్ రెడ్డి, ముఖ్యమంత్రి సెక్రటరీ స్మిత సబర్వాల్ పరిశీలించారు. ఇటీవల నూతన సచివాలయం ప్రారంభోత్సవం తర్వాత సీఎం కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించి.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎం ఆదేశాలతో నేడు మంత్రి, అధికారులు ప్రాజెక్టును సందర్శించారు. ఎంపీ పోతుగంటి రాములు, ఇతర అధికారులతో కలిసి పీఆర్ఎల్ఐ అప్రోచ్ కెనాల్, పంపు ఔస్ ను పరిశీలించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా దక్షిణ తెలంగాణ ప్రజల దశాబ్దపు కల నెరవేరుతుందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణా నదిలోని ఏడు టీఎంసీల నీటిని ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలు కలిపి మొత్తం 12 లక్షల 50 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రణాళిక తయారు చేసినట్లు మంత్రి తెలిపారు. భవిష్యత్తులో నీటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నామని చెప్పారు.