బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో బీఎస్పీ నేతలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. రేపు సరూర్‌నగర్‌లో BSP ఆధ్వర్యంలో తెలంగాణ భరోసా సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో మాయావతితో పాటు పలువురు అగ్రనేతలు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కరోజు ముందుగానే ఆమె హైదరాబాద్‌కు చేరుకున్నారు. సభ కోసం ఆర్‌ఎస్ ప్రవీణ్ సహా రాష్ట్ర నాయకులు భారీగా జమసమీకరణ చేస్తున్నారు.