ఉత్తర నైజీరియాలోని నైజర్ నదిలో 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 100 మంది మృతిచెందారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు ఉన్నారు. కోగి రాష్ట్రం నుంచి పొరుగున ఉన్న నైజర్ రాష్ట్రానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఇందులో గల్లంతైనట్లు నైజర్ స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ప్రతినిధి ఇబ్రహీం తెలిపారు. పడవలో పట్టే చోటు లేకపోయినా ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. లైఫ్ జాకెట్లు, సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం కూడా ప్రమాదాలకు కారణాలుగా కనిపిస్తున్నాయి.
ఈరోజు తెల్లవారుజామున కోగి రాష్ట్రం నుంచి నైజర్‌లో ఫుడ్ మార్కెట్‌కు వెళ్తుండగా ఈ పడవ ప్రమాదానికి గురైంది. గల్లంతైన వారిలో ఏడుగురు మృతి చెందారు. మిగతా వారిని రక్షించేందుకు స్థానిక డైవర్లు రంగంలోకి దిగారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.