బంగారం (gold), వెండి (silver) కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇటీవల వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీపావళికి ముందు రూ.80 వేల పైకి చేరిన బంగారం ఆ తర్వాత క్రమంగా తగ్గింది. గత వారం రూ.76 వేల స్థాయికి పడిపోయింది. అయితే ఈ వారంలో మళ్లీ బంగారం ధరలు పైకి ఎగబాకాయి. మళ్లీ రూ.80 వేల స్థాయికి చేరుకున్నాయి. దేశంలో పెళ్లిళ్ల సీజన్ కావడంతో చాలా మంది బంగారం కొనుగోళ్లు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు (నవంబర్ 24న) ఉదయం 7.00 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 79, 640కి చేరింది.
ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 79, 790కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 73,150కి చేరుకుంది. ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79, 640కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 73, 000కి చేరింది. వెండి ధరలు కూడా భారీగా తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
- హైదరాబాద్లో రూ. 79, 640, రూ. 73, 000
- విజయవాడలో రూ. 79, 640, రూ. 73, 000
- ఢిల్లీలో రూ. 79, 790, రూ. 73, 150
- ముంబైలో రూ. 79, 640, రూ. 73, 000
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
- హైదరాబాద్లో రూ. 1, 01, 000
- విజయవాడలో రూ. 1, 01, 000
- ఢిల్లీలో రూ. 92, 000
- చెన్నైలో రూ. 1, 01, 000
- కోల్కతాలో రూ. 92, 000
గమనిక:
పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.