నగరం ఖాళీ అయ్యిందా అనిపిస్తోంది. ఏ కూడలి చూసినా బోసిపోయి కనిపిస్తోంది. నగరమంతా పల్లెబాట పట్టడంతో హైదరాబాద్ లోని రోడ్లన్నీ ఖళీగా దర్శనమిస్తున్నాయి.నిరంతరం ట్రాఫిక్ తో కొట్టుమిట్టాడే నగర జనం రెండు రోజులుగా ఊపిరి పీల్చుకుంటున్నారు. కిటకిటలాడే మెట్రో రైళ్ళ కూడా ఖాళీగానే నడుస్తున్నాయి. అయితే తెలంగాణలోని జిల్లాలకు వెళ్ళే అన్నీ బస్సులు రద్దీగా మారాయి. విజయవాడ, నిజామాబాద్, వరంగల్ రహదారుల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా కనిపిస్తోంది. హైదరాబాద్-విజయవాడ మార్గంలో చిట్యాల వద్ద కిలో మీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించి పోయింది. గంటలకొద్దీ ఎక్కడ వాహనాలు అక్కడనే ఆగిపోయాయి. ట్రాఫిక్ సమస్యను సరిదిద్దేందుకు పోలీసులతో పాటు టోల్ గేట్ సిబ్బంది కూడా సహకరిస్తున్నారు.