AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సాయన్నకు మరీ ఇంత అవమానమా..

ఇది కేసీఆర్‌ అహంకారానికి పరాకాష్ట
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆగ్రహం

మహబూబ్‌నగర్‌: కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న చనిపోతే కనీసం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపకపోవడం సీఎం కేసీఆర్‌ అహంకారానికి పరాకాష్ట అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు దళితులు అంటే ఎంత ప్రేమో దీనిని చూస్తే తెలుస్తోందన్నారు. మంగళవారం కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపం చౌరస్తాలో ప్రజా గోస – బీజేపీ భరోసా కార్నర్‌ మీటింగ్‌లో ఈటల మాట్లాడుతూ.. మొన్నటి వరకూ సీఎం కార్యాలయంలో గిరిజన, దళిత, బీసీ, మైనారిటీలు ఒక్కరు కూడా లేరన్నారు. ఏడేళ్ల కాలంలో ఒక్క దళితుడికి భూమి ఇవ్వలేదని విమర్శించారు. అసెంబ్లీలో తనను మాట్లాడనివ్వలేదన్నారు. ధరణి రాష్ట్రంలోని పేదల కొంపలు ముంచిందని తెలిపారు. పేదల బ్రతుకులు మారుతాయని అనుకుంటే.. చిన్న చిన్న

దేశంలోనే అత్యంత త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం అని చెబుతున్నారని.. కనీసం అన్ని జిల్లాల ఉద్యోగులకు నెల నాడు జీతాలు చెల్లించే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ అమరులు కోరుకున్న తెలంగాణ లేదని అన్నారు. నిరుద్యోగ భృతి 3,116 అన్నారని.. అదీ అమలు కాలేదని దుయ్యబట్టారు. ఇలా రైతుల కళ్లల్లో.. మహిళల కళ్లల్లో.. నిరుద్యోగుల కళ్లల్లో మట్టి కొట్టారన్నారు. 2024లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ ఉద్యమంలో, అసెంబ్లీలో మాట్లాడిన మాటలను.. ఇప్పుడు మాట్లాడుతున్న మాటలను ప్రజలు గమనించాలన్నారు. బీఆర్‌ఎస్‌ను ఆ దేవుడు కూడా కాపాడలేడని ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10