AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శ్రీరాంసాగర్‌ నీళ్లు ఇచ్చే దమ్ముందా?

సీఎం కేసీఆర్‌కు జై తెలంగాణ అనే దమ్ములేదు కానీ, తన సొంత ఆస్తి అయినట్టు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టును ధారాదత్తం చేస్తారట.. కేసీఆర్‌కు మహారాష్ట్ర రైతులే ముఖ్యమా.. ఇక్కడి రైతులు కారా.. ఇక్కడ రైతుల మరణాలకు బాధ్యుడు కాదా అని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌.. శ్రీరామ్‌ సాగర్‌ నీళ్ళు తన సొంత ఆస్తి అయినట్లు ఫీల్‌ అవుతున్నారని మండిపడ్డారు. మహారాష్ట్ర వాళ్లకు అప్పనంగా అర్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మీ రాజకీయాలకు శ్రీరామ్‌ సాగర్‌ ప్రాజెక్ట్‌ను ధారాదత్తం ఎలా చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మహారాష్ట్రకు నీళ్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటూ నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ బంపరాఫర్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. నిన్న మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం… మహారాష్ట్ర సహకారంతోనే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పూర్తి అయినట్లు చెప్పారు. అవసరమైతే శ్రీరాంసాగర్‌ నీళ్లను మహారాష్ట్ర లిఫ్ట్‌ చేసుకోవచ్చని తెలిపారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10