జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు బండ్ల గణేశ్‌కు పూర్తిగా చెడినట్లు కనిపిస్తోంది. అనుస్టాపబుల్ షోలో బండ్ల గణేశ్‌పై పవన్‌కల్యాణ్ స్పందించిన తీరుకు ఆయన హర్ట్ అయ్యారు. దీంతో ఏందన్నా.. బండ్లన్నా.. అంటూ ఓ అభిమాని ఆవేదనతో చేసిన ట్వీట్‌కు బండ్ల గణేశ్ స్పందించారు. తన విశ్వరూపం చూపిస్తానని ప్రకటించారు. పవన్‌కు, బండ్లగణేశ్‌కు మధ్య గ్యాప్ పెంచడానికి ఈ ట్వీట్ల చర్చ జరుగుతుందని పలువురు భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు కుదిరి అధికారంలోకి రాగలిగితే.. పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి చేస్తారనే ప్రచారం సైతం గతంలో ఊపందుకున్న విషం తెలిసిందే. రెండున్నర సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పీఠాన్ని టీడీపీ-జనసేన పంచుకునేలా కార్యాచరణ రూపొందించుకున్నాయనే విషయం జనసేన గ్రూపుల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీన్ని ఆధారంగా చేసుకుని- తాజాగా ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ కీలక వ్యాఖ్యలు చేశారని పలువురు అంటున్నారు. కాబోయే ముఖ్యమంత్రి పవన్ కల్యాణేనని అందుకే సినిమాలు తీయదలచుకోలేదని చెప్పారు. ‘బాస్ ఈజ్ నెక్స్ట్ సీఎం.. నో ఫిల్మ్ బ్రదర్’ అని యూజర్ అడిగిన ప్రశ్నకు రిప్లై ఇచ్చారు.