AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మోగిన ఎమ్మెల్సీ ఎన్నికల నగారా

షెడ్యూల్‌ విడుదల చేసిన ఎన్నికల సంఘం

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 16న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌ నగర్‌ ఉపాధ్యాయ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. అటు ఆంధ్రప్రదేశ్‌ లో మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 3 పట్టబధ్రుల, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీల స్థానాలున్నాయి. నామినేషన్లను దాఖలు చేయడానికి ఈ నెల 23 చివరి తేదీ, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఫిబ్రవరి 27. మార్చి 13 న ఎన్నికలు నిర్వహించనున్నారు. 16తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల సంఘం పేర్కొంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10