AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీజేపీ స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌లకు అనూహ్య స్పందన

– క్షేత్ర స్థాయిలో చర్చనీయాంశమైన ‘‘స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌’’లు
–  గజ్వేల్‌, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాల్లోనూ అధిక సంఖ్యలో మీటింగ్‌ లు
–  రాష్ట్రవ్యాప్తంగా 8 వేలకు చేరువలో ‘‘స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌’’లు
–  గడువులోగా లక్ష్యాన్ని పూర్తి చేయాలని పార్టీ నేతలకు బండి సంజయ్‌ ఆదేశం
–  స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌ తీరుతెన్నులపై జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జీలతో సమీక్ష నిర్వహించిన బండి

హైదరాబాద్‌: ప్రజా గోస- బీజేపీ భరోసా స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌ లకు అనూహ్య స్పందన లభిస్తోంది. క్షేత్ర స్థాయిలో ఈ మీటింగ్‌ లపట్ల సానుకూల చర్చ జరుగుతోంది. ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జీలతో సమావేశమై స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌ లపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు, స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌ ఇంఛార్జ్‌ కాసం వెంకటేశ్వర్లు, జాతీయ కార్యవర్గ సభ్యులు గరికిపాటి మోహన్‌ రావు, రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి, అధికార ప్రతినిధి జె.సంగప్ప తదితరులు హాజరైన ఈ సమీక్షలో బూత్‌ కమిటీ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇంఛార్జీలుసహా స్థానిక కార్యకర్తలు లీడర్లుగా ఎదగడానికి ఈ మీటింగ్‌ లు ఉపయోగపడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది.

– బీజేపీ నాయకులు ఉత్సాహంగా స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌ ల్లో పాల్గొంటూ స్థానిక సమస్యలపై చర్చించడంతోపాటు కేసీఆర్‌ పాలనా వైఫల్యాలను, కేంద్ర ప్రభుత్వ విజయాలను క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లేడంలో సఫలీక్రుతమవుతున్నారని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌ ల సంఖ్య 8 వేలకు చేరువలో ఉందని కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీష్‌ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌, సిరిసిల్ల, సిద్ధిపేట నియోజకవర్గాల్లోనూ ఇచ్చిన టార్గెట్‌ లో 80 శాతం మేరకు మీటింగ్‌ లు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్‌, మంచిర్యాల, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌ లు పూర్తయ్యాయని తెలిపారు. ఈ మీటింగ్‌ లో స్థానిక సమస్యలే ఎక్కువ చర్చకు వస్తున్నాయన్నారు.

– ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌ ల పట్ల సంత్రుప్తి వ్యక్తం చేశారు. ఈ మీటింగ్‌ ల ద్వారా పార్టీ తొలిదశ క్షేత్రస్థాయి ప్రచారం పూర్తి చేసుకున్నట్లయిందన్నారు. ఈ మీటింగ్‌ లకు వస్తున్న స్పందనను చూసి బీఆర్‌ఎస్‌ నేతల్లో భయం మొదలైందన్నారు. అందుకే చాలాచోట్ల మీటింగ్‌ లను బీఆర్‌ఎస్‌ నేతలు అడ్డుకుంటూ ఉనికి చాటుకునేందుకు ప్రయాస పడుతున్నారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ నేతల బెదిరింపులకు, దాడులకు భయపడాల్సిన పనిలేదని, స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌ ల ద్వారా ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తూ భరోసా ఇవ్వాలని సూచించారు.

– మరో మూడు రోజులే (ఈనెల 28 వరకు) గడువు ఉన్నందున పార్టీ నిర్దేశించిన మేరకు 11 వేల స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌ ల లక్ష్యాన్ని పూర్తి చేయాలని కోరారు. ఈ విషయంలో అలుపెరగకుండా పనిచేస్తున్న పలువురు నేతలను ఈ సందర్భంగా అభినందించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10