బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్. వరుసగా ఆరో రోజు కూడా బంగారం ధర తగ్గింది. మధ్యలో ఒక్కరోజు మాత్రం స్థిరంగా ఉన్న బంగారం ధర మొత్తానికి బాగానే దిగి వస్తోంది. ఈ ఆరు రోజుల్లో బంగారం ధర రూ.700 వరకూ తగ్గింది. కాబట్టి బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయమని చెప్పొచ్చు. శనివారం 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ. 100 వరకు తగ్గింది. అయితే 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. ఇక వెండి ధర కూడా నేడు తగ్గింది. కిలో వెండిపై రూ. 500 వరకూ తగ్గింది.