AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పేదల పార్టీ బీజేపీ.. పెద్దల పార్టీ బీఆర్‌ఎస్‌

రాష్ట్రంలో ప్రజలంతా బీజేపీవైపు చూస్తున్నారు
బీజేపీతోనే పేదలకు న్యాయం
ఓబీసీ నేతల సమావేశంలో బండి సంజయ్‌

హైదరాబాద్‌: పేదల పార్టీ బీజేపీ అయితే బీఆర్‌ఎస్‌ పెద్దల పార్టీ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్‌ పాలనపట్ల విసిగిపోయారని, వారంతా బీజేపీవైపు చూస్తున్నారని పేర్కొన్నారు. ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ నేతల సమావేశం నిర్వహించారు. జాతీయ ఓబీసీ కమిషన్‌ ఛైర్మన్‌ హన్సరాజ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలె భాస్కర్‌, ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్‌ తదితరులు హాజరైన ఈ సమావేశంలో బండి సంజయ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి వచ్చిన హన్సరాజ్‌ గంగారాంకు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం మాట్లాడారు. ముఖ్యాంశాలు.. ఆయన మాటల్లో..

– కష్టపడే కార్యకర్తలను జాతీయ నాయకత్వం గుర్తిస్తుందనేదానికి హన్సరాజ్‌ గంగారాం నిదర్శనం. నిత్యం పార్టీ కోసం కష్టపడే వ్యక్తి హన్సరాజ్‌. ఆయనను స్పూర్తిగా తీసుకుని ఓబీసీ మోర్చా నేతలు సమాజం కోసం, పార్టీ బలోపేతం కోసం పనిచేయాలి.
– రాష్ట్రంలో కేసీఆర్‌ పాలనపట్ల ప్రజలు విసిగిపోయారు. ప్రతి ఒక్కరూ బీజేపీవైపు చూస్తున్నరు. బీజేపీ పేదల పార్టీ. బీఆర్‌ఎస్‌ పెద్దల పార్టీ అనే చర్చ జరుగుతోంది. బీఆర్‌ఎస్‌ కు చెందిన జగిత్యాల మున్సిపల్‌ ఛైర్‌ పర్సన్‌ శ్రావణి కేసీఆర్‌ పాలనలో పేదలు, బలహీనవర్గాలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాయో చెప్పడమే ఇందుకు నిదర్శనం.
– పేదల బలిదానంతో తెలంగాణ వచ్చింది. పెద్దలే రాజ్యమేలుతున్నారు. పేదలకు అన్యాయం జరుగుతూనే ఉంది. బీజేపీ ఆధ్వర్యంలో పేదల రాజ్యం వస్తేనే న్యాయం జరుగుతుంది. ఎన్నికల సమయం మొదలైంది. సీఎం కేసీఆర్‌ మళ్లీ కుల సంఘాలను పిలిచి కుల సంఘాలకు డబ్బులు పంచుతారు. కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల పేరుతో వందల కోట్ల రూపాయలు ఇస్తానని మోసం చేస్తారు. ఈ విషయంలో కొందరు కుల సంఘాలు వాళ్ల సామాజికవర్గాన్ని పట్టించుకోరు. వారి సమస్యలను ప్రస్తావించారు. కేసీఆర్‌ వలలో పడి మోసం చేస్తారు.
– ఓబీసీ సామాజికవర్గ ప్రజలకు ఓబీసీ మోర్చా అండగా ఉండాలి. అన్ని కుల సంఘాలకు దిక్సూచి కావాలి. ప్రతి సామాజికవర్గాన్ని కలిసి వారి సమస్యలను తెలుసుకోవాలి. వారికి భరోసా ఇవ్వాలి. కేసీఆర్‌ పాలనలో ఓబీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించాలి. అని బండి సంజయ్‌ అన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10