AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పార్టీకి నష్టం కలిగిస్తే ఊరుకోం

ఎవరైనా పార్టీకి కట్టుబడి ఉండాల్సిందే
బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదని అగ్రనేత రాహుల్‌గాంధీ అనాడే స్పష్టం చేశారు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ
ఎంపీ కోమటిరెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్‌

జనగామ: పార్టీకి నష్టం కలిగించేలా ఎవరు మాట్లాడినా ఉపేశిక్షంచబోమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. అలా మాట్లాడిన వారిపై అధిష్టానం అంతర్గతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జనగామలో రేవంత్‌ రెడ్డి స్పందించారు. బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదని వరంగల్‌లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పష్టం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా రేవంత్‌ గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ పొత్తు ఉంటుందని ఎంతపెద్ద నాయకుడు మాట్లాడినా పార్టీ ఉపేక్షించదన్నారు. పార్టీకి నష్టం కలిగేలా ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలిచ్చామన్నారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా నిన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. ఈసారి తెలంగాణలో హంగ్‌ అసెంబ్లీ వస్తుందని జోస్యం చెప్పారు. తమతో కలవాల్సిందే కాబట్టి సీఎం కేసీఆర్‌ కాంగ్రెస్‌ను పొగుడుతూ.. బీజేపీని తిడుతున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ఒంటరిగా అధికారంలోకి రాదని, మరో పార్టీతో కలవాల్సిందేనని అన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ సెక్యులర్‌ పార్టీలని, తాము బీజేపీతో కలిసేదిలేదని స్పష్టం చేశారు. సీనియర్‌ నేతలు అందరూ కలిస్తే కాంగ్రెస్‌కు 40 నుంచి 50 సీట్లు వస్తాయని అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం విదితమే.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10