స్పష్టం చేసిన బండ్ల గణేశ్
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనతో ఇక సినిమాలు తీయదలచుకోలేదని పేర్కొన్నారు. దీనికి గల కారణాలను కూడా ఆయన వివరించారు. ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి పవన్ కల్యాణేనని తేల్చి చెప్పారు. పవన్ కల్యాణ్ తో సినిమాలను ఎప్పుడు తీస్తారంటూ ఓ ట్విట్టర్ యూజర్ అడిగిన ప్రశ్నకు బండ్ల గణేశ్ పై విధంగా సమాధానం ఇచ్చారు. తాను పవన్ కల్యాణ్ తో సినిమాలను చేయదలచుకోలేదని వివరించారు. కాబోయే ముఖ్యమంత్రి పవన్ కల్యాణేనని అందుకే సినిమాలు తీయదలచుకోలేదని చెప్పారు. ‘బాస్ ఈజ్ నెక్స్ట్ సీఎం.. నో ఫిల్మ్ బ్రదర్’ అని రిప్లై ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు కుదిరి అధికారంలోకి రాగలిగితే.. పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి చేస్తారనే ప్రచారం సైతం గతంలో ఊపందుకున్న విషం తెలిసిందే. రెండున్నర సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పీఠాన్ని టీడీపీ-జనసేన పంచుకునేలా కార్యాచరణ రూపొందించుకున్నాయనే విషయం జనసేన గ్రూపుల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీన్ని ఆధారంగా చేసుకుని- తాజాగా ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ కీలక వ్యాఖ్యలు చేశారని పలువురు అంటున్నారు.