AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేటి నుంచి బయో ఏషియా

హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో 20వ బయో ఆసియా సదస్సుకు రంగం సిద్ధ మైంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతి ష్టాత్మకంగా తలపెట్టిన ఈ సదస్సు హైదరా బాద్‌లోని హెచ్‌ఐసిసిలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. ‘మానవీ య ఆరోగ్య పరిరక్షణలో భవిష్యత్తు తరానికి మార్గదర్శనం’ అనే నినాదంతో నిర్వహించబ డుతోంది. కాగా ఈ సదస్సును మంత్రి కెటిఆర్‌ ఉదయం 10.30 గంటలకు ప్రారంభించను న్నారు. మొత్తం 120 దేశాల నుంచి ప్రభుత్వ ప్రముఖులు, పరిశ్రమల అధిపతులు, పరి శోధ కులు, వ్యవస్థాపకులు, నోబెల్‌ పురస్కార విజేత లు, శాస్త్రవేత్తలు, ఇతర ప్రతినిధుల పాల్గొన ను న్నారు. ప్రధానంగా ఆరోగ్య డేటా అ నలిటిక్స్, కృత్రిమ మేధ, బ్లాక్‌చెయిన్‌ వంటి న వీన సాంకేతికతను జతచేసి దరికీ నాణ్యమైన ఆరోగ్య సంర క్షణ అందు బాటులోకి తేవడమే లక్ష్యంగా సదస్సు జరగనుంది.

2028 నాటికి రాష్ట్రంలో లైఫ్‌ సై న్సెస్‌ ఎకో సిస్టం విలువను రెట్టింపు చేయడమే లక్షంగా పెట్టుకున్న ప్రభుత్వం ఈ బయో సదస్సును సంపూర్ణంగా వినియోగిం చుకోనుంది. ఈ సదస్సుకు గౌరవ అతిథులుగా నీతి ఆయోగ్‌ (హెల్త్‌) సభ్యుడు డా. వి.కె. పాల్, నోవర్టిస్‌ సిఇఒ డా. వాస్‌ నరసింహాన్, లు హాజరవుతున్నారు. జీనోమ్‌ వ్యాలీలో జరిగి న బయో ఏషియా కర్టెన్‌ రైజర్‌ ఈవెంట్‌లో ఫెడ రేషన్‌ ఆఫ్‌ ఏషియన్‌ బయోటెక్‌ అసోసియేషన్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును ప్రముఖ శా స్త్రవేత్త, రాష్ట్ర బయోటెక్‌ అడ్వైజరీ కమిటీ చైర్మ న్‌ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ బాలసుబ్రమ ణియన్‌ కు గురువారం ప్రదానం చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10